25 రోజులు రూ.205 కోట్లు.. "భరత్ అనే నేను" కలెక్షన్స్...

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూర్తి రాజకీయ కోణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం గత నెల 20వ తేదీన

Webdunia
బుధవారం, 16 మే 2018 (14:12 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూర్తి రాజకీయ కోణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం గత నెల 20వ తేదీన విడుదలై ఇప్పటికీ 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఏకంగా రూ.205 కోట్ల గ్రాస్‌, రూ.95 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.65.32 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
పైగా, మహేష్ బాబు సినీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మిగిలిపోయింది. అలాగే, "బాహుబలి" చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కిన రామ్ చరణ్ "రంగస్థలం" చిత్రాన్ని అధికమించింది. ప్రస్తుతం టాప్-3 కలెక్షన్ల జాబితాలో 'బాహుబలి', 'భరత్ అనే నేను', 'రంగస్థలం' చిత్రాలు ఉన్నాయి. 
 
ఇకపోతే, 'భరత్ అనే నేను' చిత్రాన్ని కొనుగోలు చేసిన, పంపిణీ చేసిన వారికి లాభాల పంట పడుతోంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టగా, మరొకొన్ని ఏరియాల్లో లాభాలకి చేరువలో వుంది. దర్శకుడిగా కొరటాలకి గల ఇమేజ్ .. మహేశ్ బాబుకి గల క్రేజ్ .. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments