అమెరికాలో మహానటికి 6వ స్థానం... ఆ చిత్రాలను అధిగమిస్తుందా? (Video)
సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి సినిమా రికార్డుస్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరి
సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి సినిమా రికార్డుస్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలోను ఈ సినిమా తన దూకుడు చూపుతోంది. శుక్రవారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్‌కి చేరువలో వుంది.
అమెరికాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాలలో మహానటి సినిమా 6వ స్థానంలో నిలిచింది.
'రంగస్థలం' .. 'భరత్ అనే నేను' .. 'అజ్ఞాతవాసి' .. 'భాగమతి' .. 'తొలిప్రేమ' సినిమాలు మొదటి అయిదు స్థానాల్లో ఉండగా, 6వ స్థానంలో 'మహానటి' నిలిచింది. సావిత్రి బాల్యం .. ఆమె నట జీవితం.. వ్యక్తిగత జీవితం తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం అంటున్నారు సినీ ప్రియులు. అమెరికాలో నేటికీ మంచి కలెక్షన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
1 మిలియన్ దగ్గరలో ఉన్న మహానటి అక్కడ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో..? కలెక్షన్స్ విషయం పక్కనపెడితే మహానటి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని అద్భుతం చిత్రం అని చూసినవారు అంటున్నారు.