Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమి మీద నడయాడే దేవత అమ్మ... (మహేష్-రాశి ఖన్నా-షాలినీ పాండే) హేపీ మదర్స్ డే

భూమి మీద నడయాడే అమ్మ దేవతలను గుర్తు చేసుకునేందుకు ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ఫలితంగా అచ్చంగా అమ్మల కోసమే మదర్స్‌డే వచ్చింది. అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా దానికి గుర్తింపు వచ్చింది. ఈ విషయాలు పూర్వాపరాలు, ఈ వేడుకతో ముడిపడిన కొన్ని ఆచార

భూమి మీద నడయాడే దేవత అమ్మ... (మహేష్-రాశి ఖన్నా-షాలినీ పాండే) హేపీ మదర్స్ డే
, ఆదివారం, 13 మే 2018 (12:49 IST)
భూమి మీద నడయాడే అమ్మ దేవతలను గుర్తు చేసుకునేందుకు ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ఫలితంగా అచ్చంగా అమ్మల కోసమే మదర్స్‌డే వచ్చింది. అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా దానికి గుర్తింపు వచ్చింది. ఈ విషయాలు పూర్వాపరాలు, ఈ వేడుకతో ముడిపడిన కొన్ని ఆచారాల వివరాలు ఇప్పుడు మీ కోసం.
మహేష్ బాబు అమ్మగారు
 
ప్రాచీన కాలంలో గ్రీకులు వసంత కాలం పొడవునా మాతృత్వ ఉత్సవాలు నిర్వహించే వారు. చెట్లు చిగురించే ఈ కాలాన్ని అమ్మతనానికి ప్రతిరూపంగా భావిస్తూ మాతృత్వ ప్రతీక అయిన గ్రీకు దేవతల తల్లి రియాకు ఉత్సవాలు జరిపేవారు. ఇదేవిధంగా క్రీస్తు పూర్వం 250 ప్రాంతాలలో రోమనులు కూడా వసంత కాలంలో మాతృదినోత్సవాన్ని నిర్వహించేవారు. తమ అమ్మ దేవత సిబెలె వేషధారణలతో, ఆటపాటలతో మూడురోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు.
webdunia
తల్లితో రాశీఖన్నా
 
యుగోస్లేవియాలో మదర్స్‌ డే రోజున పిల్లలు తల్లిని సరదాగా తాళ్ళతో బంధించే ఆచారం ఉంది. తాము కోరిన కానుకలు సమర్పించుకుంటేనే పిల్లలు ఆమెను బంధవిముక్తురాల్ని చేస్తారు. మదర్స్‌డే రోజున అమెరికాతో సహా చాలా దేశాల్లో కార్నేషన్ పూలను తల్లికి బహుమతిగా ఇస్తుంటారు.
webdunia
తల్లితో షాలినీ పాండే
 
ఈ పువ్వులను ఇవ్వడం వెనుక ఒక చిన్న కారణం ఉంది. జీసస్‌కు శిలువ వేసినపుడు మేరీ మాత కొడుకు పాదాలను పట్టుకొని దుఃఖించారు. అప్పుడు ఆమె కన్నీటి బొట్ల నుంచి ఉద్భవించినవే కార్నేషన్ పూలు అని ఒక నమ్మకం. మాతృ ప్రేమ జాలువారగా పుట్టిన వీటికంటే ఉన్నతమైన పూలు వేరే ఏముంటాయి తల్లికి ఇవ్వడానికి అన్నదే ఈ పువ్వులను ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం అంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధ్యానం వల్ల కలిగే మేలు...