Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'కి గుమ్మడికాయ కొట్టేశారు.. బోరున ఏడ్చిన హీరోయిన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన సొంత బ్యానర్‌ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "మహానటి". అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (18:35 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన సొంత బ్యానర్‌ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం "మహానటి". అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఈనెల 21వ తేదీన గుమ్మడికాయ కొట్టేశారు. అంటే చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈనేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్ మాట్లాడుతూ, 'మాటెక్నికల్ టీమ్ ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేయడమేకాక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని మిగుల్చుతుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా "మహానటి" వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి మా బ్యానర్‌లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
 
ముఖ్యంగా, సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు ఎప్పటికీ ఋణపడి ఉంటాం. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో భాగంగా సావిత్రిగారి పటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో మా హీరోయిన్ కీర్తి సురేష్ కన్నీరు పెట్టుకొంది. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుతుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments