కాజల్ అగర్వాల్‌కు రాజకీయాల్లోకి వెళ్ళాలనిపిస్తోందట...

ఎమ్మెల్యే. ఈ పేరుతో ఎన్నో సినిమాలు గతంలో వచ్చినా సరే ఇప్పుడు తను నటించిన సినిమా పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెబుతోంది అందాల తార కాజల్. ''కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఎమ్మెల్యే సినిమాలో నటించింది. రేపు ఆ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులక

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (18:21 IST)
ఎమ్మెల్యే. ఈ పేరుతో ఎన్నో సినిమాలు గతంలో వచ్చినా సరే ఇప్పుడు తను నటించిన సినిమా పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెబుతోంది అందాల తార కాజల్. ''కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఎమ్మెల్యే సినిమాలో నటించింది. రేపు ఆ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. కళ్యాణ్‌ రామ్‌తో నాకు ముందు నుంచి పరిచయం ఉంది. చాలా రోజుల తరువాత మళ్ళీ కళ్యాణ్‌ రామ్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.
 
కళ్యాణ్‌ రామ్ యాక్టింగ్ బాగా నేర్చుకున్నాడు. నేను, ఆయన కలిసి నటించిన మొదటి సినిమాకు ఇప్పుడు నటించిన సినిమాకు చాలా తేడాలున్నాయి. సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. సినిమాలో నేను ఎన్.ఆర్.ఐగా కనిపిస్తా. రాజకీయ నేపథ్యంగా నడిచే చిత్రమిది.
 
సినిమా చూసిన తరువాత రాజకీయాల్లోకి వెళ్ళాలనిపిస్తోంది'' అని స్నేహితులతో నవ్వుతూ చెప్పిందట కాజల్. నువ్వా.. రాజకీయాల్లోకా అంటూ ఆశ్చర్యంగా స్నేహితులు అడిగితే అంతా తమాషాగా లేవే అంటూ చెబుతోందట కాజల్. ఈ సినిమా తరువాత మరో రెండు తెలుగు సినిమాల్లో కాజల్ నటించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amritsar: పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో అగ్ని ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు (video)

Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments