Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషులు లాగే రిక్షాను సావిత్రి ఎక్కేది కాదు.. సావిత్రి స్నేహితురాలు సుశీల

''మహానటి'' సినిమాలో సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర వుంటుంది. ఈమె ప్రస్తుతం విజయవాడలో వుంటున్నారు. సుశీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహానటి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జెమినీ గణేశన్‌ను వివా

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (16:09 IST)
''మహానటి'' సినిమాలో సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర వుంటుంది. ఈమె ప్రస్తుతం విజయవాడలో వుంటున్నారు. సుశీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహానటి గురించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకోవద్దని చాలామంది చెప్పినా ఆమె వినిపించుకోలేదని.. చిన్ననాటి స్నేహితురాలైన తాను చెప్పినా పట్టించుకోలేదని సుశీల అన్నారు.
 
జెమినీ గణేశన్‌ను సావిత్రి వివాహం చేసుకోనుందనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు.. ఇంకా చాలామంది జెమినీని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. బంధువులు కూడా అదే మాట అన్నారు. సావిత్రి తాను కలిసి విజయవాడలో కలిసి తిరుగుతూ పెరిగామని చెప్పారు. 
 
సావిత్రి స్టార్ హీరోయిన్ అయినా తన బాల్య స్నేహితురాలైన సుశీలను మరిచిపోలేదని.. వీలును బట్టి ఆమెను కలుసుకోవడం.. ఉత్తరాలు రాయడం చేసేవారని సుశీల తెలిపారు. డాన్సు క్లాసుల కోసం తాను సావిత్రి చాలా దూరం నడవాల్సి వచ్చేదని, రిక్షాల్లో వెళ్లమని సావిత్రికి తనకు ఇంట్లో వాళ్లు డబ్బు ఇచ్చేవాళ్లు. కానీ అప్పట్లో అక్కడ మనుషులు లాగే రిక్షాలే ఉండేవు. 
 
ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చారు గదా రిక్షాలో వెళదామా? అని తాను అడిగితే.. అదేవిటే పాపం వాళ్లూ మనుషులే గదా.. వాళ్లు మనల్ని లాగడమేంటి అనేది. తాను కూర్చుని వేరేవాళ్లతో రిక్షా లాగించుకోవడం.. టైమైపోతుందంటే రిక్షావాళ్లు రిక్షా లాగుతూ పరిగెత్తడం సావిత్రికి ఇష్టం వుండేది కాదని.. వాళ్లు పడే కష్టం చూడలేకనే ఆమె ఆ రిక్షాలు ఎక్కకుండా నడిచేదంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments