Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిరామ్, కోన వార్త‌లపై శివాజీ రాజా చాలా తెలివిగా త‌ప్పించుకున్నాడు!

శ్రీరెడ్డి ప్ర‌ధానంగా నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్, స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ ఓ ఫోటోను లీక్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, కొన్ని టీవ

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (11:13 IST)
శ్రీరెడ్డి ప్ర‌ధానంగా నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్, స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ ఓ ఫోటోను లీక్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, కొన్ని టీవీ ఛానెళ్లలోనూ పదేపదే చూపించారు. ఈ విషయంపై ద‌గ్గుబాటి ఫ్యామిలీ స్పందించ‌లేదు కానీ.. కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని.. దీనిపై సమగ్ర విచారణ జ‌రిపించాలంటూ ప్ర‌భుత్వాన్ని కోరారు.
 
ఇదిలావుంటే... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ఈ విష‌యంపై స్పందించారు. టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం శివాజీ రాజా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 
 
కోన వెంకట్, అభిరామ్ గురించి స్పందించాలని విలేకరులు కోరారు. దీంతో శివాజీ రాజా మాట్లాడుతూ కోన వెంకట్‌తో మాకు సంబంధం లేదు.. రైటర్స్ అసోసియేషన్ అనేది ఉంది. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు. ఇక అభిరామ్ దుగ్గుబాటి నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అది అంటూ చాలా తెలివిగా శివాజీ రాజా స‌మాధానం చెప్పి తప్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments