Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదిమందిని పట్టుకుని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారా?: శివాజీరాజా ఎదురుదాడి

డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఎవరో పది మందిని పట్టుకుని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారా అంటూ మా అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా ఎదురుదాడికి దిగాడు. అదేసమయంలో మీడియా సంయమనం పాటించాలని

పదిమందిని పట్టుకుని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారా?: శివాజీరాజా ఎదురుదాడి
, బుధవారం, 26 జులై 2017 (12:34 IST)
డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఎవరో పది మందిని పట్టుకుని సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారా అంటూ మా అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా ఎదురుదాడికి దిగాడు. అదేసమయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతున్న విషయం తెల్సిందే. 
 
డ్రగ్స్ వినియోగంపై ఆరోపణలు వచ్చిన నాటి నుంచి ఇందులో భాగమయ్యారంటూ టాలీవుడ్ నటులపై పలు కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. దీంతో తొలుత సిట్‌కు పూర్తిగా సహకరిస్తామని చెప్పిన టాలీవుడ్ నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటోంది.
 
సిట్ విచారణతో టాలీవుడ్ పరువు, ప్రతిష్టలు మంటగలిశాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ, ఆర్.నారాయణ మూర్తి తదితరులు సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ ఉన్నాయా? సినీ పరిశ్రమలోని వారే విచారణకు దొరికారా? అంటూ సిట్‌పై ఎదురుదాడికి దిగారు. 
 
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అయితే, మరికాస్త ముందడుగు వేసి...ఎక్సైజ్ డైరెక్టర్ బాహుబలిలా, సినీ పరిశ్రమలోని వారు విలన్లులా భావిస్తున్నారని పలు ట్వీట్లు సంధించారు. ఈ క్రమంలో శివాజీ రాజా పది మందిని పట్టుకుని సినీ పరిశ్రమను బ్లేమ్ చేయడం మంచిదికాదని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లారీల స్ట్రయిక్‌కు.. పాపులకు లింకుందా?