Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి పేరు చెప్పుకుని.. 16ఏళ్ల బాలికల్ని కూడా వదల్లేదు: శ్రీరెడ్డి కొత్త లీక్

శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి శ్రీరామ్, కోనవెంకట్‌లపై ఆరోపణలు చేస్తూ.. ట్వీట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా ఎన్నో చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించ

Advertiesment
చిరంజీవి పేరు చెప్పుకుని.. 16ఏళ్ల బాలికల్ని కూడా వదల్లేదు: శ్రీరెడ్డి కొత్త లీక్
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:41 IST)
శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి శ్రీరామ్, కోనవెంకట్‌లపై ఆరోపణలు చేస్తూ.. ట్వీట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా  ఎన్నో చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన వాకాడ అప్పారావును టార్గెట్ చేసింది. వాకాడ అప్పారావు వందలాది మంది అమ్మాయిలను వాడుకున్నాడని ట్విట్టర్లో అతని ఫోటోతో సహా శ్రీరెడ్డి ఆరోపించింది. 
 
16 ఏళ్ల బాలికలను కూడా ఇతడు వదిలిపెట్టలేదని ఆరోపించింది. మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పుకుని ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని.. దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించకండంటూ శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన శ్రీరెడ్డిపై మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. టాలీవుడ్ లో అమ్మాయిలు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని.. ఇందుకు నిరసనగా శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మా నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ తాను సాధించింది పెద్ద విజయమేమీ కాదని వ్యాఖ్యానించింది.
 
"సంధ్యా అక్కా, సజయా అక్కా, దేవీ అక్కా, వసుధక్కా,అపూర్వక్కా... లవ్ యూ. ఇది విక్టరీ కాదు. సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి" అని శ్రీరెడ్డి వెల్లడించింది. అంతకుముందు మరో పోస్టులో "ఉస్మానియా యూనివర్శిటీ అన్నలకి పాదాభివందనమన్నా" అంటూ పోస్టు పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన నంద‌మూరి హీరో..!