Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మా'' ఎన్నికలపై హేమ తీవ్ర ఆరోపణలు.. రూ.3కోట్లు అలా ఖర్చు పెట్టేశారు..

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (13:54 IST)
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలపై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది 'మా' అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. 
 
రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు నరేశ్‌ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. 
 
తోటి నటులకు హేమ పంపిన వాయిస్‌ రికార్డు టాలీవుడ్‌ సర్కిల్‌లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఎన్నికలు జరగకూడదని, నరేష్‌ అధ్యక్షుడిగా కొనసాగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని వాయిస్‌ రికార్డులో హేమ తెలిపారు.
 
ఇంతవరకు మా అసోసియేషన్‌ రూపాయి సంపాదించకపోగా ఉన్న రూ.5కోట్ల నిధులను నరేష్‌ 2 కోట్లకు తీసుకొచ్చారని 3కోట్లు వృధాగా ఖర్చు చేశారంటూ ఆరోపించారు. గతంలో ఆఫీస్‌ ఖర్చు బయటి నుంచి తీసుకువచ్చి ఇచ్చేవాళ్లమని, కానీ నరేష్‌ హాయిగా కూర్చొని అకౌంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హేమ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments