Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెగేదాకా లాక్కండి ప్ర‌కాష్‌రాజ్‌- ఇది బెదిరింపా! అంటున్న మ‌రో వ‌ర్గం

తెగేదాకా లాక్కండి ప్ర‌కాష్‌రాజ్‌- ఇది బెదిరింపా! అంటున్న మ‌రో వ‌ర్గం
, బుధవారం, 4 ఆగస్టు 2021 (15:58 IST)
chittibabu-Raj
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వాడిగా వేడిగా మాట‌ల సంభాష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌ని ప్ర‌క‌టించిన ప్ర‌కాష్‌రాజ్ తెగేదాకా లాక్కండి.. అంటూ ట్వీట్ చేయ‌డంతో కొంద‌రు మండిప‌డుతున్నారు. ఇది బెదిరింపుధోర‌ణిగా వుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
మూడు నెల‌ల‌నాడే`సినీ మా బిడ్డ‌లు` పేన‌ల్ ముందుగా ప్ర‌క‌టించి అధ్య‌క్షుడిగా నిల‌బ‌డుతున్న‌ట్లు వెల్ల‌డించాడు ప్ర‌కాష్‌రాజ్‌. ఇక ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల లెక్క‌ల‌తో ముగ్గురు అభ్య‌ర్థులు పోటీకి దిగారు. నాగ‌బాబు కూడా ప్ర‌కాష్‌రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌డంతో క‌థ ర‌సమ‌యింగా మారింది. తాజాగా మా ఎన్నిక‌ల ప్ర‌కియ‌ను ఈనెల 22న చిరంజీవి పుట్టిన‌రోజున ప్ర‌క‌టిస్తార‌ని ఇటీవ‌లే జ‌రిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ ఆన్‌లైన్ మీటింగ్‌లో వెల్ల‌డించారు. ఇంకోవైపు మోహ‌న్‌బాబు త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నాడు.
 
అయితే, తాజాగా బుధ‌వారంనాడు ప్ర‌కాష్‌రాజ్ `తెగేదాకా లాక్కండి` అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఇంకా ప‌లువురు స్పందించాల్సివుంది. ఇప్ప‌టికే ప్ర‌కాష్‌రాజ్‌పై నాన్‌లోక‌ల్ ముద్ర ప‌డింది. ఈ విష‌య‌మై ఆయ‌న స్పందిస్తూ.. న‌న్ను నాన్ లోక‌ల్ అన్న‌వారినే ప్ర‌శ్నిస్తున్నాను. నేను నాన్ లోక‌ల్ అయితే తెలంగాణాలో రెండు గ్రామాల‌ను ఎందుకు ద‌త్త‌త తీసుకుంటాను?  నేను టాలీవుడ్‌లోనే ప‌నిచేశాను. అప్పుడు నేను నాన్ లోక‌ల్ అని ఎందుకు అడ‌గ‌లేదు. న‌టుడికి నాన్ లోక‌ల్ అనేది వుండ‌దు. నేను నాన్ లోక‌ల్ అయితే జాతీయ అవార్డులు తెలుగు సినిమాల‌కు ఎందుకు ఇస్తారు? `మా` అసోసియేష‌న్ అభివృద్ధిక నా ద‌గ్గ‌ర మంచి ప్ర‌ణాళిక‌లు వున్నాయి. అవి నాగ‌బాబుగారికి తెలుసు. మా పేన‌ల్ స‌భ్యుల‌కూ తెలుసు. అందుకే తెగేదాకా లాక్కండి అంటూ నినాదంలా ఆయ‌న ట్వీట్ చేశాడు.
 
తెలుగువారు బానిస‌లా?
నాన్ లోక‌ల్ విష‌యంలో మొద‌టినుంచి వ్య‌తిరేకిస్తున్న మా స‌భ్యులు మంచు విష్ను వ‌ర్గం కానీ, సీనియ‌ర్ న‌రేష్ వ‌ర్గం కానీ ఇతర సినీ పెద్ద‌లు కూడా సినిమాలో న‌టించ‌డం వేరు. పాలించ‌డం వేరు అనే నినాదం చేస్తున్నారు. మా లో సీనియ‌ర్ స‌భ్యుడు, న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా అయిన త్రిపుర‌నేని చిట్టిబాబు ఈ విష‌యంలో తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌న తెలుగు న‌టులు కోలీవుడ్ ,బాలీవుడ్‌, మాలీవుడ్ కు వెళ్ళి అక్క‌డి అసోసియేష‌న్‌లో పెత్త‌నం చేస్తామంటే ఊరుకుంటారా?  అస‌లు రానిస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే అభిప్రాయం ఇత‌ర మా స‌భ్యుల‌లోనూ నెల‌కొంది. కేవ‌లం పెత్త‌నం చేయ‌డానికి తెలుగువారు బానిస‌లుగా క‌నిపిస్తున్నారా? అంటూ నిల‌దీస్తున్నారు. దాదాపు ఇదే అభిప్రాయం టాలీవుడ్‌లో నెల‌కొంది. కానీ ఎవ‌రూ ఈ విష‌యాన్ని ర‌చ్చ చేయ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్నారు. సెప్టెంబ‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో బానిస‌లైన తెలుగువారు ప్ర‌కాష్‌రాజ్‌కు ఓటు వేయండ‌నే నినాదం లేవ‌నెత్తునున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ‌వ‌ల్లికి డబ్బులు పెట్టలేదు- అప్పుడు మ్యాడ్ సినిమాను తిట్టారు, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు