Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పులికి విలుకాడుకి.. తలకి ఉరితాడుకి' - ఆర్ఆర్ఆర్ నుంచి 'దోస్తీ' సాంగ్‌ రిలీజ్

Advertiesment
'పులికి విలుకాడుకి.. తలకి ఉరితాడుకి' - ఆర్ఆర్ఆర్ నుంచి 'దోస్తీ' సాంగ్‌ రిలీజ్
, ఆదివారం, 1 ఆగస్టు 2021 (11:28 IST)
'పులికి విలుకాడుకి.. తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి.. కసిరే వడగళ్లకి
రవికీ మేఘానికీ.. దోస్తీ
ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో..' అంటూ సాగే ఈ పాట ఇద్ద‌రు భిన్న‌మైన మ‌న‌స్కుల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని తెలియ‌జేసేలా సాగింది. 
 
ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి తొలి ఆడియో సింగిల్‌ను చిత్ర బృందం ఆదివారం విడుద చేసింది. అక్టోబరు 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ మేక‌ర్స్ మూవీకి సంబంధించి వినూత్న ప్ర‌చారం చేస్తున్నారు. 
 
ఇటీవ‌ల మేకింగ్ వీడియో విడుద‌ల చేసి అంచ‌నాలు భారీగా పెంచిన మేక‌ర్స్ 'రౌద్రం రణం రుధిరం’ చిత్రంలోని తొలి పాట ‘దోస్తీ’ని విడుద‌ల చేశారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. 
 
ఐదు భాషల్లోనూ… బాణీ ఒక్కటే. కానీ, గాత్రం మాత్రం వేర్వేరు. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్‌ రవిచందర్‌, హిందీలో అమిత్‌ త్రివేదీ, మలయాళంలో విజయ్‌ యేసుదాసు, కన్నడలో యాజిన్‌ నిజార్‌ పాడారు. 
 
తెలుగులో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా… తమిళంలో మదన్‌ కర్కి, హిందీలో రియా ముఖర్జీ, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, తమిళంలో మన్‌కొంబు గోపాలకృష్ణన్‌ రాశారు.
 
ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య ఫ్రెండ్షిప్ నేప‌థ్యంలో ఈ సాంగ్ రూపొందించారు. ఈ రోజు స్నేహితుల సంద‌ర్భంగా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. కీరవాణి త‌న‌దైన శైలిలో బాణీలు స‌మ‌కూర్చారు.
 
'బాహుబలి' సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.  ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కిన్ షోలో కాంప్రమైజ్ కాని రుహానీ శర్మ - హాట్ లుక్‌తో పిచ్చెక్కిస్తోంది...