Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీటెక్కిన మా ఎన్నికలు - బరిలో ఉన్న అభ్యుర్థుల జాబితా ఇదే..

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (11:20 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికలు సమయం సమీపించే కొద్దీ నటీనటుల రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా, ప్రచారాలు, విమర్శలతో రోజురోజుకు రసతవత్తరంగా మారుతున్నాయి. 
 
నిజానికి ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందే సినీ పరిశ్రమలో చర్చలతో హీటెక్కింది. ఇప్పటికే బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అయితే అనుహ్యాంగా జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్.. అధ్యక్ష పదవి కోసం చేస్తున్న సీవీఎల్ సైతం తమ నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. 
 
దీంతో ఇప్పుడు మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు. ఆది నుంచి వీరిద్ధరి మధ్యే పోటీ ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఇరువురి ప్యానల్ సభ్యులు బహిరంగ విమర్శలు చేసుకున్నారు.
 
ఇదిలావుంటే, అక్టోబరు 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే అదే రోజున సాయంత్రం ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో బండ్లగణేష్, సీవీఎల్ తమ నామినేషన్స్ ఉపసహరించుకోవడంతో మా ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. 
 
ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. అలాగే.. వైస్ ప్రెసిడెంట్ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బెనర్జీ, హేమలు పోటీ చేస్తుండగా.. విష్ణు ప్యానల్ నుంచి మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీ పడుతున్నారు. 
 
ఇకపోతే, ప్రధాన కార్యదర్శి పదవికి.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్ పోటీపడుతుండగా.. విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు పోటీ చేస్తున్నారు. ఇక కోశాధికారి పదవికి శివబాలాజీ.. నాగినీడు.. రెండు జాయింట్ సెక్రెటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు. ఇక అసోసియేషన్‏లో 18 ఈసీ పోస్టులకు మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూ కాశ్మీర్‌కు చార్మిత్రాత్మక మైలురాయిగా మొదటి సరుకు రవాణా రైలు

కుల్గాంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు, 9 మంది గాయపడ్డారు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

లక్షద్వీప్ దీవులలోని ఉపాధ్యాయుల కోసం ఏఐ శిక్షణా కార్యక్రమం

Andhra Pradesh: ఇండియా జస్టిస్ రిపోర్ట్- 2025: రెండో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్

నా స్కూటీ నాకిచ్చేయండి... వా... అంటూ పోలీసుల వద్ద ఏడ్చిన యువతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments