Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతతో నా ఫ్యామిలీ గడిపిన ప్రతిక్షణం ఎంతో మధురమైనది.. నాగార్జున

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (11:04 IST)
టాలీవుడ్ దంపతులు అక్కినేని నాగ చైతన్య, సమంతలు వీడిపోవడంపై స్టార్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. వీరిద్దరూ విడిపోవడం దురదృష్టకరమన్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాల్ ఓ పోస్ట్ చేశారు.
 
"చైతూ - సమంత విడిపోవడం దురదృష్టకరం. భార్యభర్తలు విడిపోవడం వారి వ్యక్తిగత విషయం' అంటూ పేర్కొన్నారు. సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున చెప్పుకొచ్చారు.
 
‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతు-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. 
 
సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. 
 
కాగా, చైతన్య-సమంత తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు చైతన్య. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments