Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్‌లో ఇదే నా డ్యూటీ : చిరంజీవి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:55 IST)
కరోనా వైరస్ గొలుసు కట్టును అడ్డుకునేందుకు దేశం లాక్‌డౌన్‌లో ఉంది. 130 కోట్ల మంది ప్రజానీకం ఇపుడు తమతమ గృహాలకే పరిమితమైవున్నారు. ఈ విషయంలో పేదోడు.. సెలెబ్రిటీ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో ఉంటున్నారు. అయితే, సెలెబ్రిటీలు లాక్‌డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయంలో తమ ఇంటి పనుల్లో నిమగ్నమైవున్నారు. వాటిని వారు ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్లో తాను చేస్తున్న పనులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాజాగా త‌న ఇంట్లోని మొక్క‌ల‌కి నీళ్లు ప‌డుతూ కనిపించాడు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ ఫోటో కింద "మొక్కే క‌దా అని వ‌దిలేస్తే.." అని తాను నటించిన "ఇంద్ర" సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌ని జ‌త చేశాడు. షూటింగ్ లేని కార‌ణంగా ప్ర‌తి రోజు ఇదే నా డ్యూటీ అంటూ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు చిరు. ఆయ‌న ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో "ఆచార్య" అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments