Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అమ్మ''పై నమ్మకం లేదు.. మహిళల్ని ఆట బొమ్మలుగా చూస్తారా? అక్కినేని అమలతో పాటు?

అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)పై సీనియర్ నటీమణులు మండిపడుతున్నారు. ఇప్పటికే కిడ్నాప్, నటిపై లైంగికదాడి కేసులో నిందితుడైన నటుడు దిలీప్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ అమ్మ తీసుకున్న న

Webdunia
సోమవారం, 2 జులై 2018 (15:02 IST)
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)పై సీనియర్ నటీమణులు మండిపడుతున్నారు. ఇప్పటికే కిడ్నాప్, నటిపై లైంగికదాడి కేసులో నిందితుడైన నటుడు దిలీప్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ అమ్మ తీసుకున్న నిర్ణయంపై యంగ్ హీరోయిన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా అమ్మ అసోసియేషన్ తీసుకుంటున్న చర్యల పట్ల నటీమణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతేగాకుండా తోటి నటి లైంగిక దాడికి గురైతే ఆమెకు న్యాయం చేయాల్సిందిపోయి.. నిందితుడికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళలను ఆట బొమ్మలుగా చూస్తున్నారని... అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారని సీనియర్ నటీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా ''విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్'' తరపున 15మంది సీనియర్ నటీమణులు తాము తిరిగి అసోసియేషన్‌లో చేరేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ 15మందిలో అక్కినేని అమలతో పాటు శాంతి బాలచంద్రన్, రంజనీ, సజిత, కుస్రూతీ తదితరులున్నారు. ఇకపై అమ్మ ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందంటూ సీనియర్ హీరోయిన్లు ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. ఆ ప్రకటనలో అసోసియేషన్‌ను నమ్మే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితుల్లో అమ్మలో తిరిగి చేరబోమని తేల్చేశారు.  
 
ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న మ‌ల‌యాళం హీరో దిలీప్ పై మాలీవుడ్ మూవీ అర్టిస్ట్స్ అసోసియేష‌న్ గ‌తంలో విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది. దీంతో అక్క‌డి హీరోయిన్స్ అసోసియేష‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ లాల్ ఎన్నికైన మరుసటి రోజే దిలీప్‌పై నిషేధాన్ని తొలగించారు.
 
ఈ నిర్ణయానికి నిరసనగా మోహన్ లాల్ ఇంటి ముందు యూత్ కాంగ్రెస్ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో దిలీప్ మాట్లాడుతూ, కేసులో తాను నిర్దోషినని తేలేంత వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం