Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''డియ‌ర్ కామ్రేడ్''లో గోదావరి వ్యక్తులకే ఛాన్స్.. అర్జున్ రె ''ఢీ''

''అర్జున్ రెడ్డి''తో యూత్ మధ్య క్రేజ్‌ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మహానటితో గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. టాక్సీవాలాలో నటిస్తున్నాడు. ఇంకా వ

Advertiesment
''డియ‌ర్ కామ్రేడ్''లో గోదావరి వ్యక్తులకే ఛాన్స్.. అర్జున్ రె ''ఢీ''
, ఆదివారం, 1 జులై 2018 (15:51 IST)
''అర్జున్ రెడ్డి''తో యూత్ మధ్య క్రేజ్‌ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మహానటితో గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. టాక్సీవాలాలో నటిస్తున్నాడు. ఇంకా వరుస సినిమాలతో జెట్ వేగంలో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు విజయ్ రెడీ అయిపోయాడు. 
 
మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డియ‌ర్ కామ్రేడ్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడట విజ‌య్‌. హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకోనున్నారు. సోమవారం (జూలై-2) ఉద‌యం 10గం.ల‌కి గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ మేర‌కు పోస్టర్‌ ని విడుద‌ల చేసి విష‌యాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. 
 
ఈస్ట్‌, వెస్ట్ గోదావ‌రి జిల్లాల‌కి సంబంధించిన టాలెంట్ వ్య‌క్తుల‌ని మాత్ర‌మే డియ‌ర్ కామ్రేడ్ సినిమా కోసం ఎంపిక చేయ‌నున్నట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించగా, ఇటీవ‌ల కాకినాడ‌లో ఆడిషన్స్ నిర్వ‌హించినట్లు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో ''సాహో''.. హెవీ ఛేజింగ్ సన్నివేశాలు..