Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (14:04 IST)
వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తోక‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ సినిమా రూపొంద‌నుంది. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఆదివారం (డిసెంబ‌ర్ 15) లావ‌ణ్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. 
 
‘స‌తీ లీలావ‌తి’ చిత్రంతో మ‌రోసారి డిఫ‌రెంట్ రోల్‌, ఎగ్జ‌యిటింగ్ క‌థాంశంతో మెప్పించ‌టానికి లావ‌ణ్య త్రిపాఠి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. 
 
మిక్కీ జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా, బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఉద‌య్ పొట్టిపాడు మాట‌లు అందిస్తుండ‌గా.. కోసనం విఠ‌ల్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, స‌తీష్ సూర్య ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. 
 
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్
నిర్మాత‌లు: నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి
ద‌ర్శ‌క‌త్వం:  తాతినేని స‌త్య‌
సంగీతం:  మిక్కీ జె.మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  బినేంద్ర మీన‌న్‌
మాట‌లు: ఉద‌య్ పొట్టిపాడు
ఆర్ట్‌:  కోసనం విఠల్ 
ఎడిట‌ర్‌:  స‌తీష్ సూర్య‌
పి.ఆర్‌.ఒ:  మోహ‌న్ తుమ్మ‌ల‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments