Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యబ్రహ్మ బ్రహ్మానందకు లలిత కళా పురస్కారం

హాస్యబ్రహ్మ బ్రహ్మానందకు లలిత కళా పురస్కారం లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రఖ్య ఆర్ట్స్ 18వ వార్షికోత్సవ వేడుకలో బ్రహ్మానందానికి లలిత కళా పురస్కారాన్ని అందజేశారు సీనియర్ నటీ జమున, ఎన్టీఆ

Webdunia
గురువారం, 24 మే 2018 (12:21 IST)
హాస్యబ్రహ్మ బ్రహ్మానందకు లలిత కళా పురస్కారం లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రఖ్య ఆర్ట్స్ 18వ వార్షికోత్సవ వేడుకలో బ్రహ్మానందానికి లలిత కళా పురస్కారాన్ని అందజేశారు సీనియర్ నటీ జమున, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతి.


ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. అందరినీ నవ్వించడంలోనే తనకు ఆనందం ఉందన్నారు. ఇన్నేళ్లుగా అభిమానులు తనను ఆదరిస్తున్నందుకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. 
 
హాస్య నట బ్రహ్మ అవార్డును ఈ ఏడాది మార్చి నెలలో టీఎస్‌ఆర్‌ కాకతీయ లలిత కళాపరిషత్‌ చేతుల మీదుగా అందుకున్న హాస్యబ్రహ్మ.. తాజాగా లలిత కళా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. కాగా బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. 
 
సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టం పుచ్చుకున్నారు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments