Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడూ, నా పిల్ల‌లు క‌లిసి వెన్నుపోటు పొడిచారు.. 29వరకు ఆగండి

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (13:05 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర రిలీజ్‌ని ఎన్నికలు అయ్యేంత వరకు ఆపాల్సిందిగా ఓ వ్యక్తి ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేసాడు. ఇంతలో సెన్సార్ బోర్డు సైతం చిత్రం విడుదల వాయిదా వేసుకోవాల్సిందిగా పేర్కొనడంతో ఆర్జీవీ న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమయ్యాడు. 
 
ఈ తంతు జరుగుతున్న సమయంలోనే చిత్ర యూనిట్ రేపు ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్‌కి పంపనుండగా, మూవీ రిలీజ్‌పై సెన్సార్ బోర్డ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని అంద‌రు ఆస‌క్తిగా చూస్తున్నారు. మరి వర్మ మాత్రం ఈ చిత్రాన్ని వారం త‌ర్వాత అంటే మార్చి 29న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 
 
ఈ పోస్టర్‌పై వాడూ, నా పిల్ల‌లు క‌లిసి నన్ను వెన్నుపోటు పొడిచారు అనే క్యాప్ష‌న్ రాసాడు. అసలు నిజాలు తెలుసుకోవాలంటే మార్చి 29 వరకే ఆగండి అని వర్మ స్పష్టం చేసాడు. ఈసారైనా వర్మ ఫిక్స్ చేసిన కొత్త డేట్‌కి చిత్రం రిలీజ్‌కి నోచుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments