Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:56 IST)
Pottisriramulu movie prakatana
తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన వ్య‌క్తి పొట్టి శ్రీరాములు. వారి స్ఫూర్తివంతమైన జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేయాలనే ఆశయంతో కూచిపూడి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా, జాతీయ దృక్పధం, అభ్యుదయ భావజాలం కలిగిన ప్రతిభావంతులైన యువ దర్శకులు కణ్మణి గారి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు. 
 
పొట్టి శ్రీరాములుగారి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో, సమకాలీన భారత చరిత్ర నేపధ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం శ్రీరాములు సంచరించిన తెలుగు, తమిళ ప్రాంతాల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ  షూటింగ్ జరుపుకోనుంది. డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచించిన "తెలుగే మన ఆత్మబలం ! తెలుగే మన ఆయుధం ! తెలుగే మన ఊపిరి ! తెలుగే మన ఉద్యమం! అనే పల్లవితో తెలుగుజాతి సాంస్కృతిక వైభవాన్ని కీర్తించే ప్రబోధాత్మక గీతాన్ని సాలూరి వాసు రావు గారి సంగీత దర్శకత్వంలో ఈ రోజు రికార్డింగ్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో అమ‌ర‌జీవి పొట్టిశ్రీ‌రాములు గారి మ‌నువ‌రాళ్లు  శ్రీ‌మ‌తి రేవ‌తి, శ్రీ‌మ‌తి అనురాధ‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఏవీఎమ్ రావు, సార‌థి స్టూడియోస్ డైరెక్ట‌ర్ కేవీ రావు, పి. సాంబ‌శివ‌రావు, రేలంగి న‌ర‌సింహారావు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, దామోద‌ర ప్ర‌సాద్‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రాం స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌, ల‌క్ష్మ‌ణ‌రాయి గోపాల కృష్ణ‌, కృష్ణ మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొని అమ‌ర‌జీవి పొట్టి శ్రీ రాములు చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మానికి శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.
 
ద‌ర్శ‌కుడు క‌ణ్మ‌ణి మాట్లాడుతూ, ``న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత కూచిపూడి రాజేంద్ర‌ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఏ సినిమాకైనా టెక్నిషియ‌న్స్ అవ‌స‌రం చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల‌కు మ‌రింత ఎక్కువ అవ‌స‌రం. ఇదొక పీరియ‌డ్ ఫిలిం. హిస్ట‌రీ ఉంది. ఎలాంటి త‌ప్పిదాలు లేకుండా తెర‌కెక్కించాలి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు పొట్టి శ్రీ‌రాములు గారి గొప్ప‌ద‌నం గురించి చెప్పే అవ‌కాశం ల‌భించ‌డం నా అదృష్టం``అన్నారు.
 
నిర్మాత కూచిపూడి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ, క‌ణ్మ‌ణి గారితో మ‌ద్రాసు నుండి మంచి అనుభందం ఉంది. ఆయ‌న మొద‌టి తెలుగు సినిమా `నా ఊపిరి` క‌థ న‌చ్చి నేను కూడా నిర్మాణంలో భాగం కావ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథుల‌కు పేరు పేరునా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం అన్నారు.
 
 సంగీతం: వాసు రావు సాలూరి, మాటలు , పాటలు: డా. వెనిగళ్ళ రాంబాబు, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మల్లికార్జున్ నారగాని, ఆర్ట్ డైరెక్టర్: డి.వై. సత్యనారాయణ, నిర్మాత: కూచిపూడి రాజేంద్రప్రసాద్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments