Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ నాన్ వెజ్ పెద్దగా తినరు, ఆరోజు వ్యాయామం చేయలేదు, కానీ..: శ్రీకాంత్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:54 IST)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సినీపరిశ్రమ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అన్ని సినీపరిశ్రమల నుంచి ప్రముఖులు వెళ్ళి రాజ్ కుమార్ పార్థీవ దేహానికి ఘన నివాళులు అర్పించారు. సినిమాల్లో బిజీగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఉన్నట్లుండి చనిపోవడం మాత్రం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేస్తోంది.
 
పునీత్ ఒక్కరే కాదు ఆయన తండ్రి కూడా ఇది వరకే గుండెపోటుతోనే చనిపోయారట. కుటుంబంలో ఇలా గుండెపోటుతో చనిపోవడం అభిమానులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది. అయితే పునీత్ ఎక్కువగా జిమ్ చేయడం వల్లే చనిపోయాడని.. గుండెపైన ఒత్తిడికి గురికావడంతోనే పునీత్ మృతికి కారణమైందని అందరూ భావించారు. కానీ అసలు విషయాన్ని హీరో శ్రీకాంత్ చెప్పాడు. అసలు తెలుగు హీరో శ్రీకాంత్ పునీత్ మృతిపై మాట్లాడడం ఏంటని అనుకోవచ్చు.
 
జేమ్స్ సినిమాలో నటిస్తున్నారు శ్రీకాంత్, పునీత్ రాజ్ కుమార్. ఈ సినిమాలో బాడీ గార్డ్‌గా పునీత్ రాజ్ కుమార్ కనిపిస్తున్నాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఇప్పటికే పూర్తయి త్వరలో విడుదల కూడా కాబోతోందట. అయితే ఇంతలో పునీత్ రాజ్ కుమార్ చనిపోవడంతో శ్రీకాంత్ తన మనస్సులోని మాటను చెప్పాడు.
 
పునీత్ ఎప్పుడూ ఇంటి ఫుడ్‌నే తింటారు. ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కూరగాయలనే ఎక్కువగా తీసుకుంటారు. నాన్ వెజ్ జోలికి పెద్దగా వెళ్ళరు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో జిమ్ కూడా చేయలేదు. ముందు రోజు ఆయన జిమ్‌కు వెళ్ళలేదు.
 
ఎందుకంటే ఆయన నాతో పాటు షూటింగ్‌లో ఉన్నారు. ఫిట్నెస్ ముఖ్యమే. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఒక మంచి నటుడిని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు శ్రీకాంత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments