Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూవీ టైటిల్ విని కెటీఆర్ భ‌య‌ప‌డ్డార‌ట

తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి కెటీఆర్ అప్పుడ‌ప్పుడు సినిమా ఫంక్ష‌న్‌ల‌కు వ‌స్తుండ‌టం.. సినిమాల గురించి ట్వీట్ చేస్తుండ‌డం తెలిసిందే. సినిమాలతో ట‌చ్‌లో ఉంటున్న కెటీఆర్ ఓ మూవీ టైటిల్ విని భ‌య‌పడ్డార‌ట‌. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటారా? ఈ న‌గ‌రానికి ఏమైంది. పెళ్లి చ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (18:10 IST)
తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి కెటీఆర్ అప్పుడ‌ప్పుడు సినిమా ఫంక్ష‌న్‌ల‌కు వ‌స్తుండ‌టం.. సినిమాల గురించి ట్వీట్ చేస్తుండ‌డం తెలిసిందే. సినిమాలతో ట‌చ్‌లో ఉంటున్న కెటీఆర్ ఓ మూవీ టైటిల్ విని భ‌య‌పడ్డార‌ట‌. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటారా? ఈ న‌గ‌రానికి ఏమైంది. పెళ్లి చూపులు ఫేమ్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. కొత్తవాళ్ల‌తో తెర‌కెక్కించిన ఈ నగ‌రానికి ఏమైంది సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పైన సురేష్ బాబు నిర్మించారు. 
 
విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రం ఈ నెల‌ 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం చేనేత కళాకారులకు మద్దతుగా వారిని ప్రోత్సహిస్తూ చేనేత వస్త్రాలను ధరించాలని భావించాం. 
 
ఈ కార్యక్రమానికి తరుణ్ భాస్కర్ ఆహ్వానిస్తూ.. ‘ఈ నగరానికి ఏమైంది?’ ఈవెంట్‌కి అందరూ చేనేత వస్త్రాలను ధరించే వస్తామన్నారు. అయితే కొంత ఛీటింగ్ చేశారు కానీ.. పాటించినందుకు ధన్యవాదాలు. ఈ నగరానికి ఏమైంది టైటిల్ విని నేను భయపడ్డా.. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా పేపర్స్‌లో ‘ఈ నగరానికి ఏమైంద’ని రాస్తారు. అందుకే భయపడ్డా అని చెప్పారు. ఈ చిత్రం  కూడా పెళ్లి చూపులు కంటే పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments