Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూకు నిశ్చితార్థం : అకీరా - ఆద్యలతో రుషికొండకెళ్లిన పవన్

తన మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో తన ఇద్దరు బిడ్డలను మాజీ భర్త పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారు ఈ బిడ్డలను తీసుకుని పవన్ కళ్యాణ్ రుషికొండలోని సాయి రిసార్ట్స్‌కు వెళ్లారు.

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (17:02 IST)
తన మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో తన ఇద్దరు బిడ్డలను మాజీ భర్త పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారు ఈ బిడ్డలను తీసుకుని పవన్ కళ్యాణ్ రుషికొండలోని సాయి రిసార్ట్స్‌కు వెళ్లారు.
 
పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితానికి గుర్తుగా అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టిన విషయం తెల్సిందే. గత పదేళ్లుగా వీరిద్దరూ పూణెలోని రేణూ వద్దే ఉంటూ వచ్చారు. అయితే, రేణూ దేశాయ్ మరో వ్యక్తిని వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ నిశ్చితార్థం కూడా సోమవారం జరిగింది. 
 
దీంతో అకీరా, ఆద్యలను పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారు. ఈ ఇద్దరిని తీసుకుని పవన్‌ కళ్యాణ్‌ సోమవారం విశాఖపట్నం వచ్చారు. ఈ నెల 26 నుంచి విశాఖపట్నంలో పోరాట యాత్ర చేయనున్నట్టు నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. జిల్లాలో పోరాట యాత్రకు రంజాన్‌ కారణంగా మధ్యలో విరామం ప్రకటించారు. 
 
ఈ సమయంలోనే ఆయన కంటికి సంబంధించిన చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నారు. వైద్యులు దానికి ఇంకా సమయం వుందని చెప్పడంతో విశాఖలో మలి విడత యాత్రకు సన్నద్ధమయ్యారు. గతంలో ఒంటరిగా వచ్చిన పవన్‌కల్యాణ్‌ ఈసారి తన కుమారుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్యతో వచ్చి.. రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో బస చేశారు. ఇకపై అకీరా, ఆద్యలు పవన్ వద్దే ఉండేలా కనిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments