Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో విపరీతమైన నెగటివిటీ.. ఇక బైబై.. రేణూ దేశాయ్

''ట్విట్టర్‌లో విపరీతమైన నెగటివిటీ నిండి వుందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ వుండే వాళ్లు అధికంగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్నవాళ్లు. ఒక సినిమా గురించి కానీ, రాజకీయ వ్యక్తుల గ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (16:27 IST)
''ట్విట్టర్‌లో విపరీతమైన నెగటివిటీ నిండి వుందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ వుండే వాళ్లు అధికంగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్నవాళ్లు. ఒక సినిమా గురించి కానీ, రాజకీయ వ్యక్తుల గురించి కానీ, ఎప్పుడూ నెగిటివ్‌గా రాయడానికే ఇష్టపడతారు. నేను ఒక నూతన జీవితం ప్రారంభిస్తున్నాను.


ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నా ట్విట్టర్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేసి, ఈ నెగిటివిటీకి దూరంగా ఉండదలుచుకున్నాను. అదే సమయంలో నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అంటూ రేణూ దేశాయ్ ట్వీట్ చేశారు. 
 
కాగా సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌ తాను మళ్లీ వివాహం చేసుకుంటున్నానని ప్రకటించగానే, సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో పలువురి నుంచి విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రేణూ దేశాయ్‌ స్పందించి తన చివరి ట్వీట్‌ చేసి, ట్విట్టర్‌ నుంచి వైదొలిగింది. 
 
కాగా.. నటి రేణూ దేశాయ్‌ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుండగా, కొందరి నుంచి మాత్రం ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. దయచేసి పెళ్లి చేసుకోవద్దంటూ కొందరు ఆమెకు సోషల్ మీడియా ద్వారా తెలుపుతుండగా, మరికొందరు మాత్రం హెచ్చరికలు చేస్తున్నారు. రేణూ వల్ల మా దేవుడికి ఎలాంటి సమస్య రాకూడదని అభిమానులు అంటున్నారు.

పీకే మీద మీకు కోపం ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో వచ్చే నెగిటివ్‌ కామెంట్లను పట్టించుకోవద్దని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు రేణూ దేశాయ్ బై బై చెప్పేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments