Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులకిత్‌ సామ్రాట్‌తో డేటింగ్ చేస్తున్నా : కృతి కర్భందా (video)

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (15:27 IST)
మోడల్ రంగం నుంచి వెండితెరకు పరిచయమైన నటి కృతి కర్భందా. అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ హీరోగా వచ్చిన చిత్రం బోణి. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ మోడల్... ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన తీన్‌మాన్ చిత్రంలో నటించింది. బ్రూస్‌లీ చిత్రంలో హీరో రామ్ చరణ్‌కు చెల్లిగా నటించింది. 
 
అయితే, అటు బాలీవుడ్, ఇటు తెలుగు, కన్నడ భాషల్లో పలువురు స్టార్ హీరోలతో న‌టించిన‌ప్ప‌టికి ఈ అమ్మ‌డికి మంచి స‌క్సెస్ రాక‌పోవ‌డంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. తాజాగా 'హౌజ్‌ఫుల్‌ 4'లో కనిపించింది. ఈ చిత్రం మంచి హిట్ సాధించ‌డంతో కృతికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఈమె ప్రస్తుతం 'పాగ‌ల్ పంతీ' అనే మూవీలో నటిస్తోంది. ఇందులో పుల‌కిత్ సామ్రాట్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. 
 
అయితే పుల‌కిత్, కృతి కొన్నాళ్ళుగా ప్రేమ‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విప‌రీత ప్ర‌చారం జ‌రిగింది. అది నిజ‌మ‌న్న‌ట్టు అత‌నితో చ‌క్క‌ర్లు కొట్ట‌డం, పార్టీల‌కి హాజ‌రైంది కృతి. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని ఫ్యాన్స్ బ‌ల్ల‌గుద్ది చెప్పారు. తాజాగా కృతి త‌మ రిలేష‌న్‌షిప్‌పై నోరు విప్పింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పుల‌కిత్ సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వెల్లడించింది. 
 
"మేమిద్ద‌రం జంట‌గా సరిపోతాం కాబ‌ట్టి మా మీద పుకార్లు వ‌చ్చాయి. అయితే అవేమి పుకార్లు కాదు. నేను సామ్రాట్‌తో ప్రేమ‌లో ఉన్నాను. మేమిద్ద‌రం ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డానికి కేవ‌లం ఐదు నెల‌ల స‌మ‌య‌మే ప‌ట్టింది. త‌న‌తో మాట్లాడ‌టం నాకెంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఆయ‌న మీద ఉన్న న‌మ్మ‌కంతోనే నా ప్రేమ విష‌యాన్ని మీకు చెపుతున్నాను. ఇప్పుడు మ‌న‌శ్శాంతింగా ఉంది" అని చెప్పుకొచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments