Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుకు కండీష‌న్స్ పెట్టిన‌ కొర‌టాల‌. ఇంత‌కీ ఏంటా కండీష‌న్స్..?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (11:32 IST)
చిరంజీవి ప్ర‌స్తుతం సైరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అయితే....ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చిన చిరును చూస్తే.. చాలా బొద్దుగా ఉన్నారు అనే విష‌యం తెలుస్తుంది. ఖైదీ నెం 150తో పోలిస్తే ఆయ‌న బాగా లావ‌య్యార‌నే చెప్పాలి. సైరాకి బ‌రువు, లావు ఇబ్బంది కాదు. ఎందుకంటారా.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌కు ఆ మాత్రం `భారీ`ద‌నం కావాల్సిందే. 
 
రెగ్యుల‌ర్ సినిమాల్లా ఇందులో స్టెప్పులు ఉండ‌వు. పైగా ఈ పాత్ర‌కు ఇలా క‌న‌ప‌డ‌డ‌మే క‌రెక్ట్. ఈ సినిమా త‌ర్వాత చిరు కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. సందేశం ఉంటూనే వినోదం కూడా జోడిస్తుంటారు. అలాగే అభిమానులు కోరుకునే అన్నింటిని చ‌క్క‌గా చూపిస్తారు. అందుక‌నే కొర‌టాల చిరుకు కండీష‌న్స్ పెడుతున్నాడ‌ట‌. 
 
ఏంటి కొర‌టాల చిరుకు కండీష‌న్స్ పెట్ట‌డం అనుకుంటున్నారా..? ష‌యం ఏంటంటే...`మీరు బ‌రువు త‌గ్గాలి` అంటూ ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నాడ‌ట‌.  సైరా షూటింగ్ నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేశాక‌.. చిరు బ‌రువు త‌గ్గ‌డం పై దృష్టి పెడ‌తార‌ని స‌మాచారం. 
 
చిరు క‌నీసం 15 కిలోలైనా బ‌రువు త‌గ్గాల‌ని చెప్పాడ‌ట‌. అందుకోసం ప్ర‌త్యేక‌మైన డైట్‌, వ్యాయామాలు మొద‌లెడుతున్నార‌ని, చిరు కోసం ఓ ట్రైన‌ర్‌ని చ‌ర‌ణ్ నియ‌మించాడ‌ని తెలిసింది. 
 
ఈ సినిమాలో చిరు రెండు పాత్ర‌ల‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఓ పాత్ర కాస్త బొద్దుగా క‌నిపించినా ఫ‌ర్వాలేద‌ట‌. అందుకే ఆ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల్ని ముందుగా చిత్రీకరిస్తార‌ని తెలుస్తోంది. కొర‌టాల చిరును ఇంకాస్త అందంగా చూపించాలి అనుకుంటున్నాడ‌న్న‌మాట‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments