Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల-చిరు సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్? హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి1 50వ సినిమా నుంచి చరణ్ సొంత బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా రూపొంద

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవి1 50వ సినిమా నుంచి చరణ్ సొంత బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న 'సైరా' సినిమాకి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. 
 
ఈ చిత్రం తర్వాత కొరటాల శివతో కలిసి చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు వార్తలొచ్చినా.. ఈ సినిమాలో చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, చరణ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇక కొరటాల దర్శకత్వం వహించే ఈ చిత్రానికి చిరంజీవి రైతుగానూ, బిలియనీర్‌గా ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం కొరటాల కసరత్తులు చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments