Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చ‌ర‌ణ్ కొత్త సినిమాను ఎనౌన్స్ చేసిన చిరంజీవి..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్లో సినిమా చేస్తున్నాడు. ఊర మాస్ సినిమా అయిన‌ప్ప‌టికీ... ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ని బోయ‌పాటి చెబుతున్నారు. ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద

Advertiesment
చ‌ర‌ణ్ కొత్త సినిమాను ఎనౌన్స్ చేసిన చిరంజీవి..!
, సోమవారం, 11 జూన్ 2018 (14:28 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్లో సినిమా చేస్తున్నాడు. ఊర మాస్ సినిమా అయిన‌ప్ప‌టికీ... ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ని బోయ‌పాటి చెబుతున్నారు. ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ రాజ‌మౌళితో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించే ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ అక్టోబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. 
 
ఇదిలాఉంటే... తేజ్ ఐ ల‌వ్ యు ఆడియో వేడుక‌లో చిరంజీవి చ‌ర‌ణ్ కొత్త సినిమాను ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ చిరు ఏమ‌న్నారంటే.... ఇటీవ‌ల రామ్‌ చ‌ర‌ణ్ నాతో మాట్లాడుతూ.. నాన్నా... నాకు కె.ఎస్‌.రామారావుగారితో సినిమా చేయాల‌నుంది. త‌ప్ప‌కుండా ఓ సినిమా చేస్తాను అన్నాడు. ఎందుకు అని అడిగితే మీకు, ఆయ‌న‌కు నేను పుట్ట‌క ముందు నుండే అనుబంధం ఉంది. ఆయ‌న అభిరుచి, టేస్ట్‌ఫుల్ నిర్మాత అని తెలుసు. 
 
రాజ‌మౌళి గారితో చేస్తోన్న సినిమా త‌ర్వాత సినిమా చేయాల్సి వ‌స్తే.. కె.ఎస్‌.రామారావుగారి బ్యాన‌ర్లోనే సినిమానే చేస్తాను అని అన్నాడు. ఏ డైరెక్ట‌ర్ అయిన పరావాలేదు అని అన్నాడు. నేను, చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర మాట కూడా క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నాను. ఈ యువత‌రం హీరోలు కూడా కె.ఎస్‌.రామారావుగారితో సినిమా చేయాల‌నుకుంటున్నారంటే ఆయ‌నేంటో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌టీజ్ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ కె.ఎస్.రామారావు గారు అని చెప్పారు చిరు. 
 
కాబట్టి... రాజ‌మౌళితో చేస్తోన్న సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ కె.ఎస్.రామారావు బ్యాన‌ర్లో సినిమా చేయ‌డం ఖాయం. మ‌రి.. ఈ సినిమాకి డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్‌తో నటించే ఛాన్స్ వస్తే..? ధనుష్ అంటే ఇష్టం: అర్జున్ రెడ్డి హీరోయిన్