Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు నయనతార... నేడు కీర్తి సురేశ్‌పై కన్నేసిన తమిళ హీరో?

మలయాళ బ్యూటీ నయనతారతో ప్రేమాయణం సాగించిన తమిళ యువ హీరో శింబు. సీనియర్ నటుడు టి.రాజేందర్ కుమారుడుగా కోలీవుడ్ వెండతెర అరంగేట్రం చేసిన శింబు.. కేరీర్ ఆరంభంలో అనేక చిత్రాల్లో నటించాడు. ఇటీవలికాలంలో సినీ అ

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (11:02 IST)
మలయాళ బ్యూటీ నయనతారతో ప్రేమాయణం సాగించిన తమిళ యువ హీరో శింబు. సీనియర్ నటుడు టి.రాజేందర్ కుమారుడుగా కోలీవుడ్ వెండతెర అరంగేట్రం చేసిన శింబు.. కేరీర్ ఆరంభంలో అనేక చిత్రాల్లో నటించాడు. ఇటీవలికాలంలో సినీ అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో శింబు మరో మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్‌పై కన్నేశాడట.
 
హీరో శింబు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడు పెంచనున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో 'సెక్క సివంద వానం' చిత్రాన్ని పూర్తి చేశాడు. తాజాగా వరుసగా మూడు నాలుగు చిత్రాల్లో నటించడానికి సంతకాలు చేసినట్లు సమాచారం. వాటిలో ఒకటి దర్శకుడు వెంకట్‌ప్రభు చిత్రం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో తెరకెక్కించేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. 
 
ఇందులో నటి కీర్తీసురేశ్‌ను నాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. "మహానటి" చిత్రం తరువాత ఈ బ్యూటీ క్రేజే వేరు. తెలుగు, తమిళం భాషల్లో పలు అవకాశాలు కీర్తీసురేశ్‌ తలుపు తడుతున్నాయట. అయితే ఇప్పటివరకూ ఒక్క చిత్రం కూడా అంగీకరించలేదని కీర్తీనే ఇటీవల స్వయంగా చెప్పింది. 
 
ప్రస్తుతం తన విజయ్‌కు జంటగా "సర్కార్", విశాల్‌తో "సండైక్కోళి 2", విక్రమ్‌ సరసన "సామి-2" చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ తర్వాతే కొత్త చిత్రాలను అంగీకరించనున్నట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో శింబుతో జతకట్టే అవకాశం వచ్చిందన్న ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. మరి శింబుతో తను ఓకే అంటుందా? లేదా? అనేది వేచిచూడాలి. కానీ శింబు మాత్రం ఆమెపై మనసు పారేసుకుని ఎలాగైనా కీర్తితో ఓకే చెప్పించాలన్న గట్టిపట్టుదలతో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments