Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

దేవీ
సోమవారం, 7 జులై 2025 (17:34 IST)
KJR, Court Fame Sridevi
తెలుగు, తమిళ భాషల్లో ' గుర్తింపు' పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో హీరోగా పరిచయమవుతోన్న కేజేఆర్ హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల 'మార్క్ ఆంటోనీ' చిత్రాన్ని నిర్మించిన  మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది. 
 
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. 'కోర్ట్' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్వి రాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: పి. వి. శంకర్, నిర్మాత: ఎస్. వినోద్ కుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments