Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ స్టార్ యష్ గృహప్రవేశం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (21:44 IST)
yash
కన్నడ స్టార్ హీరో యష్ ఓ ఇంటివాడయ్యాడు. యష్ కొత్త ఇంటి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన యష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం యష్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. ఇది కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా నిర్మిస్తుండగా... ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 
ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింక్ చివరిదశలో ఉండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
yash
 
ఈ నేపథ్యంలో బెంగుళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యష్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులో తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోని తన భార్యతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఆ ఇంట్లో ఖరీదైన వైట్ మార్పుల్, వుడ్ ఫర్నిష్ తోపాటు అత్యాధునిక సదుపాయాలతో ఆ హోం సెలెక్ట్ చేసుకున్నారు. 
 
ఇందుకోసం యష్ దాదాపు రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేశాడట. గురువారం తన భార్యతో కలిసి యష్ నూతన గృహప్రవేశం చేశాడు. ఈ వేడుకకు యష్ తల్లిదండ్రులతోపాటు.. కొంతమంది కుటుంబసభ్యులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments