కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీ- లింగ్వల్ మూవీ యొక్క అధికారిక ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. క్రేజీ కాంభినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్ నెం.4గా నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్‌మోహన్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు.
.
దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు చిత్ర నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మరియు పి. రామ్ మోహన్ రావు ఈ రోజు ధనుష్ ను హైదరాబాద్ లో కలిశారు. ధనుష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం # D43 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు.
యూనివర్సల్ అప్పీల్ మరియు అత్యంత ప్రతిభావంతులైన నటుడు-దర్శకుడితో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సోనాలి నారంగ్ సమర్పకురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నతమైన నటులు,టెక్నీషియన్స్ తో చర్చలు జరుపుతోంది చిత్ర యూనిట్. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.