నేచురల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగరాయ్` ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్, ఇటీవల రిలీజైన సాయిపల్లవి ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నాని సహా ఇతర తారాగణం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆకట్టుకుంటుంది.
ఫస్ట్‌టైమ్ నాని, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీలో నాని సరికొత్త రూపాలలో కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం, జీస్సూసేన్ గుప్తా, లీలా స్యామ్‌సన్, మణీశ్ వడ్వ, ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. శాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
డైరెక్టర్: రాహుల్ సంకృత్యాన్, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా, మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్, వెంకటరత్నం (వెంకట్), ఎడిటర్: నవీన్‌నూలి.