Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ దర్శకుడుతో ఎన్టీఆర్.. మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (09:54 IST)
తెలుగులో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరో బిగ్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఎన్టీఆర్‌తో గతంలో జనతా గ్యారేజ్ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇపుడు మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. 
 
అయితే, ఈ చిత్రానికి గత యేడాది విడుదలైన కన్నడ చిత్రం 'కెజిఎఫ్'కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. 
 
ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దక్షిణాది దర్శకధీరులు రాజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డారని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విజయంతో దేశవ్యాప్తంగా ప్రముఖ హీరోల కన్ను ఈ డైరెక్టర్‌పై పడింది.
 
తమ తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండాలని చాలా మంది నిర్మాతలు, హీరోలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇలా సంప్రదింపులు మొదలుపెట్టిన వారిలో తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉన్నారు. వీరు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేయించినట్టు సమాచారం. 
 
అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతోందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, అది పూర్తయ్యాక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments