Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే.. సోషల్ మీడియాలో తారక్ మంత్రం

Advertiesment
Jr NTR
, సోమవారం, 20 మే 2019 (11:29 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు వేడుకలను మే 20వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు. ఆయనకు శుభాంక్షలు తెలిపేందుకు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి క్యూకట్టారు. అలాగే, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా తారక్ మంత్రాన్ని జపిస్తున్నారు. 
 
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి "స్టూడెంట్ నెం:1" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తారక్, "సింహాద్రి"తో తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి, నూనుగు మీసాల ప్రాయంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత కొన్నేళ్ళపాటు వరస ఫ్లాప్‌లతో సతమతమవుతూ 'రాఖీ', "యమదొంగ" సినిమాలతో ట్రాక్‌లోకి వచ్చాడు.
 
ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన 'అదుర్స్', 'బృందావనం' వంటి చిత్రాల తర్వాత వరుస ఫ్లాప్‌లు పలుకరించారు. పిమ్మట 'టెంపర్‌'తో మళ్లీ గాడిలో పడ్డాడు. అనంతరం "నాన్నకు ప్రేమతో", "జనతా గ్యారేజ్", "జై లవ కుశ", "అరవింద సమేత" వంటి వరస విజయాలతో దూసుకెళ్తున్నాడు. 
 
సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్‌పరంగా వైవిధ్యం చూపిస్తూ, ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని అలరిస్తున్న తారక... "స్టూడెంట్ నెం:1, సింహాద్రి, యమదొంగ" సినిమాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి నాలుగో చిత్రం "ఆర్ఆర్ఆర్"లో నటిస్తున్నాడు. 2020లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయన్లు కాదు... సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయ్ : నటి జమున