Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో రోడ్డు ప్రమాదం... ఫేమస్ సింగర్ పరిస్థితి విషమం.. కుమార్తె మృతి

కేరళలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నేపథ్యగాయకుడి కుమార్తె చనిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగర్ దంపతులు కూడా ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (09:20 IST)
కేరళలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నేపథ్యగాయకుడి కుమార్తె చనిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగర్ దంపతులు కూడా ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మలయాళ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కుటుంబం త్రిస్సూర్‌లో ఓ దేవాలయ దర్శనం కోసం వెళ్లింది. అక్కడ దర్శనం, ఇతర పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరింది. 
 
ఈ క్రమంలో డ్రైవర్‌ నిద్రమత్తులో కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సింగర్ కుమార్తె తేజస్వి అక్కడికక్కడే చనిపోయింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మలయాళ చిత్ర పరిశ్రమలోకి 12 ఏళ్ళ వయస్సులో సంగీత దర్శకుడిగా బాలభాస్కర్‌ పరిచయమయ్యారు. అతి పిన్న వయసులో సినీ కెరియర్‌ను ప్రారంభించిన బాల స్టేజీ షోలతో సింగర్‌గా, వయోలినిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments