కేరళ నన్‌తో బిషప్ బేరం.. రూ.5 కోట్లిస్తా.. రేప్ చేశానని చెప్పకు...
కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని అత్యాచారం కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. సన్యాసినిపై అత్యాచారానికి పాల్పడిన బిషప్ ఇపుడు కాళ్లబేరానికి దిగాడు. రూ.5 కోట్లిస్తా.. రేప్ చేశానని చెప
కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని అత్యాచారం కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. సన్యాసినిపై అత్యాచారానికి పాల్పడిన బిషప్ ఇపుడు కాళ్లబేరానికి దిగాడు. రూ.5 కోట్లిస్తా.. రేప్ చేశానని చెప్పకు అంటూ మధ్యవర్తిద్వారా సమాచారం చేరవేశాడు.
కాగా, జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014-16 మధ్య తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఓ నన్ చర్చికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చర్చి నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అక్కడా ఆమెకు తక్షణ న్యాయం లభించలేదు. దీంతో న్యాయస్థానాలను ఆశ్రయించింది.
కేరళలో ఏం జరుగుతోంది? అంటూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కొరఢా ఝళిపించడంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసులు ఆ నన్ ఆరోపణలు కొంతమేర నిజమేనని ధృవీకరించారు. కురవిలాంగద్ అనే ఊళ్లోని చర్చిలో ఆమెను 20వ నెంబరు రూములో బంధించి, ఆమె అనుమతి లేకుండా ఫ్రాంకో అసహజ లైంగిక దాడికి, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
దీంతో తన మెడకు ఉచ్చు బిగుస్తుందని గ్రహించిన బిషప్.. కాళ్ళబేరానికి దిగారు. రేప్ కేసు ఉపసంహరించుకుంటే ఐదు కోట్ల రూపాయలిస్తానని, చర్చిలో శాశ్వతంగా జీవితం సాఫీగా సాగేట్లు చేస్తానని ఫ్రాంకో ములక్కల్ తరపున ఓ మధ్యవర్తి తమను సంప్రదించినట్లు బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపారు. 'కేసు విత్‌డ్రా చేసుకుంటే జీవితం బాగుంటుంది. మీరు నన్ను ఏం చేయలేరు. బిషఫ్‌పలంతా నేను చెప్పిందే నమ్ముతున్నారు' అని ఫ్రాంకో ములక్కల్ అంటున్నట్లు ఆయన వెల్లడించారు.