Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింబుతో మానాడులో కీర్తి సురేష్.. శశికుమార్‌కు నో..

నటనపరంగా కీర్తి సురేష్ మంచి మార్కులు సంపాదించుకుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన ఆమె చేసిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికుమార్ హీరోగా ప్రభాకరన్ దర్శకత్

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:35 IST)
నటనపరంగా కీర్తి సురేష్ మంచి మార్కులు సంపాదించుకుంది. తమిళంలో స్టార్ హీరోల సరసన ఆమె చేసిన సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శశికుమార్ హీరోగా ప్రభాకరన్ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో తాను నటించట్లేదని కీర్తి సురేష్ స్పష్టం చేసింది. 
 
ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు ప్రాజెక్టులో చేయడానికి అంగీకరించడమేననే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తి సురేశ్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందట. అందుకే కీర్తి సురేష్ శశికుమార్ సినిమాకి కాకుండా వెంకట్ ప్రభు సినిమాకి డేట్స్ ఇచ్చిందని అంటున్నారు. 
 
మహానటి ఘన విజయం అందాల తార కీర్తి సురేష్‌ క్రేజ్ పెంచేసింది. ఆ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కోసం దక్షిణాది నిర్మాతలు క్యూ కడుతున్నారట. ప్రస్తుతం విక్రమ్‌తో జతకట్టి కీర్తి సురేష్ నటించిన సామి స్వ్కేర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శింబుతో మానాడు చిత్రంలో, శశికుమార్‌తో కొంబు వెచ్చ సింగం అనే చిత్రంలో నటించమని కీర్తికి ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ శశికుమార్ సినిమాను కీర్తి వద్దనుకుందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments