Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీర్తి సురేష్ గురించి అసలు నిజం తెలిస్తే షాకే...

కీర్తి సురేష్‌.. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసిన హీరోయిన్. కానీ ఒకే ఒక్క సినిమా.. మహానటితో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళం, మళయాళం బాషల్లో కీర్తి సురేష్‌ అంటే అందరికీ బాగా తెలుసు. అలనాటి నటి సావిత్రిని అనుకరణ చేస్తూ మంచి నటిగా పేరు

Advertiesment
Keerthy Suresh
, బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:48 IST)
కీర్తి సురేష్‌.. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసిన హీరోయిన్. కానీ ఒకే ఒక్క సినిమా.. మహానటితో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళం, మళయాళం బాషల్లో కీర్తి సురేష్‌ అంటే అందరికీ బాగా తెలుసు. అలనాటి నటి సావిత్రిని అనుకరణ చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్‌. కీర్తి సురేష్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ చాలామందికి తెలియదు. 
 
కీర్తి సురేష్‌ చిన్నప్పుడే మూడు సినిమాల్లో నటించింది. మొదటగా మలయాళంలో గీతాంజలి అనే సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం మహానటి మాత్రమే. అయితే ఆమెకు నటన కన్నా ఫ్యాషన్ అంటే చాలా ఇష్టమట. చెన్నైతో పాటు లండన్‌లలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుందట కీర్తి సురేష్‌. ఫ్యాషన్ డిజైనర్‌గానే ఉండాలన్నది ఆమె కోరికట. అయితే ఆ కోరిక నెరవేరకుండా సినిమాలకే పరిమితమైపోయానని బాధపడుతూ చెబుతుందట కీర్తి సురేష్‌.
 
కీర్తి సురేష్‌ అక్క రేవతి సురేష్‌ షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్ధ రెడ్ చిల్లీస్ డిఎఫ్‌‌ఎక్స్‌లో పనిచేస్తున్నారు. తండ్రి సురేష్‌ కుమార్ సినిమా నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి సినీనటి. చిరంజీవితో కలిసి ఈమె కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. సినీ కుటుంబం నుంచి వచ్చిన కీర్తి సురేష్‌‌కు ఇప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే బాగా ఇష్టమట. అస్సలు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని ముఖం మీద చెప్పేస్తుందట కీర్తి సురేష్‌. అయితే ఇప్పుడు మహానటి సినిమాతో మంచి పేరు రావడంతో ఇక చేసేదిలేక సినిమాలకే పరిమితమైపోవాలన్న నిర్ణయానికి వచ్చేసిందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బో... సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నారు బిగ్ బాస్...