Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగడి సరుకుగా మారిన సంసార గుట్టు... ముఖానికి మాస్క్‌లు ధరించి లైవ్ స్ట్రీమింగ్‌

ఇపుడు సంసార గుట్టు అంగడి సరకుగా మారింది. పడక గదికే పరిమితం కావాల్సిన భార్యాభర్తల శృంగారం ఇపుడు నెట్టింట్లోకి ప్రవేశించింది. ఫలితంగా సంసారం గుట్టు బట్టబయలైపోతోంది.

Advertiesment
Couple Romance
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (17:36 IST)
ఇపుడు సంసార గుట్టు అంగడి సరకుగా మారింది. పడక గదికే పరిమితం కావాల్సిన భార్యాభర్తల శృంగారం ఇపుడు నెట్టింట్లోకి ప్రవేశించింది. ఫలితంగా సంసారం గుట్టు బట్టబయలైపోతోంది. వ్యక్తిగత రహస్యంగా (ప్రైవేట్‌ మూమెంట్స్‌) ఉండాల్సిన లైంగిక బంధాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ తరహా సంస్కృతి మన దేశంలోనే పెరిగిపోతోంది.
 
'సంసారం గుట్టు.. రోగం రట్టు' అనేది నానుడి. కానీ, ఇపుడు కాలం మారింది. పడగ్గదిలోకే కెమెరాలు చొచ్చుకొస్తున్నాయి. ఈ పడక గది సీన్లు  ల్యాప్‌టాప్‌ల్లోకి చొరబడి ప్రస్తుతం సెల్‌ఫోన్లలోకి చేరిపోయింది. ఎవరైనా సరే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదికాస్తా.. కుటుంబాల్లోకి చొచ్చుకొచ్చింది. దంపతులే స్వయంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చే స్థాయికి, కెమెరాల్లో ఏకాంత సన్నివేశాలను రికార్డు చేసే స్థితికి చేరింది. 
 
ఇందుకు వారు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ లైవ్‌ స్ట్రీమింగ్‌లో పాల్గొంటున్నారు. ఇలా లైవ్‌స్ట్రీమింగ్‌ ఇచ్చే వారి సంఖ్య రోజురోజుకు భారత్‌లో పెరిగిపోతోంది. కొన్ని వెబ్‌సైట్లు దంపతుల మధ్య జరిగే ఏకాంత దృశ్యాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. వీక్షకుల ఆధారంగా నెలకు లక్షల్లో చెల్లిస్తున్నాయి. 
 
భారత్‌లో ఇలా.. ఒక్కో జంట నెలకు రూ.లక్షల్లో సంపాదించడం విశేషం. వీరిలో చాలా మంది డబ్బుల కోసం కంటే.. ఇతరుల నుంచి వచ్చే కామెంట్లను తెలుసుకోవడానికే చేస్తున్నారట. ఈ వింత సంస్కృతి వేగంగా విస్తరించడం పట్ల సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్తలు ఏకాంత దృశ్యాలను రికార్డు చేస్తున్నట్లు తెలిసినా భార్యలు సహకరిస్తుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పళ్లపై పచ్చని గార మాయం కావాలంటే...