Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయా?

పొద్దస్తమానం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కళ్ళ నుంచి నీరు కారడం, కళ్ళమంట వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే, అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్‌లను చూడడం వల్ల కళ్లు కాంతిని కోల్పోయి త్వరగా అలసిపోయి

కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయా?
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:45 IST)
పొద్దస్తమానం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కళ్ళ నుంచి నీరు కారడం, కళ్ళమంట వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే, అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్‌లను చూడడం వల్ల కళ్లు కాంతిని కోల్పోయి త్వరగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. తగినంత విశ్రాంతి లేక కళ్ల చుట్టూ నల్ల వలయాలు ఏర్పడుతాయి. వీటి నివారణకు కొన్ని చిట్కాలు పాటిస్తే...
 
* కళ్లు విపరీతంగా మండుతుంటే ఐస్‌ముక్కతో కంటి చుట్టూ సున్నితంగా రాయాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్‌ అవుతారు.
* బడలికగా ఉన్నప్పుడు కీరదోసను కళ్లపై పెట్టుకోవాలి. కీరదోసలోని కూలింగ్‌ గుణాల వల్ల కళ్ల మంటలు తగ్గుతాయి. 
* రాత్రి నిద్ర పోయే ముందు నువ్వులనూనె/బాదం నూనెను కళ్ల చుట్టూ మసాజ్‌ చేసుకుని ఉదయాన్నే చల్లటి నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలు, ముడతలు పోతాయి. 
 
* బంగాళదుంప ముక్కలను గుండ్రంగా కోసి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి రెండు కళ్ల మీద కాసేపు పెట్టుకుంటే కళ్ల ఉబ్బరింపు, దురదలు తగ్గుతాయి.
* కళ్ల మంటను తగ్గించడంలో ఉప్పు నీళ్లు బాగా పనిచేస్తాయి. గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి తెల్లని గుడ్డను అందులో ముంచి దానిని కళ్ల మీద వేసుకుని 25 నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
 
* ధనియాలు కూడా కళ్ల మంటల్ని తగ్గిస్తాయి. గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ధనియాలు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం వడగట్టి ఆ నీళ్లు తాగాలి.
* కళ్ల మంటను, వాపును తగ్గించడంలో ఎగ్‌ వైట్‌ బాగా పనిచేస్తుంది. తెల్లసొనను ఒక బౌల్‌లో తీసుకుని అందులో తేనె చుక్కలు వేసి కళ్ల మీద రాయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహం వున్నవారు పసుపు ''టీ'' తీసుకుంటే?