Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' కీర్తి సురేష్ మెప్పిస్తుందా? జయలలిత బయోపిక్‌లోనూ?

మహానటి సావిత్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాలంటే మామూలు విషయం కాదు. అంతటి మహానటి పాత్రలో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందోనని ప్రస్తుతం టాక్ మొదలైంది. కానీ లుక్స్ పరంగా మాత్రం

Webdunia
మంగళవారం, 8 మే 2018 (17:43 IST)
మహానటి సావిత్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాలంటే మామూలు విషయం కాదు. అంతటి మహానటి పాత్రలో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందోనని ప్రస్తుతం టాక్ మొదలైంది. కానీ లుక్స్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేసింది.


అయితే నటనా పరంగా ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించిన కీర్తిని మహానటిగా చూపించడంలో నాగ్ అశ్విన్ సాహసం చేశారని టాక్ వస్తోంది. అయితే కీర్తిలో వున్న యాక్టింగ్ టాలెంట్, లుక్సే ఆమెకు మహానటి అవకాశాన్నిచ్చేలా చేశాయని నాగ్ అశ్విన్ అంటున్నాడు. 
 
ఇకపోతే.. తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్‌కి ఎంతో క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోల సరసన ఆమెకి వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. కీర్తి ప్రధాన పాత్రను పోషించిన ''మహానటి'' బుధవారం (మే 9) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్‌లోను కీర్తి సురేశ్ నటించే అవకాశాలు వున్నాయంటూ కోలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. 
 
ఈ వార్తలకు కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బలాన్నిస్తున్నాయి. త్వరలో తాను తమిళంలో ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాననీ, ఆ వివరాలను కొన్ని రోజుల్లో వెల్లడిస్తానని కీర్తి సురేష్ తెలిపింది. అది జయలలిత బయోపిక్ అయ్యుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments