Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి ఉస్తాద్ గా రాబోతున్నాడు

Webdunia
గురువారం, 13 జులై 2023 (10:44 IST)
Srisimha Koduri
ఇప్పటికే ఉస్తాద్ పేరును ముందు పెట్టుకున్న హీరో రామ్, ఉస్తాద్ రామ్ గా పాపులర్ అయ్యాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రాబోతున్నాడు.  తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి ఉస్తాద్ గా రాబోతున్నాడు. ఇటీవలే భాగ్ సాలె తో వచ్చాడు. ఇక హీరో శ్రీసింహా కోడూరి క‌థానాయకుడిగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆకాశం అదిరే..’ అనే వీడియో సాంగ్ రిలీజైంది. మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ఎన‌ర్జిటిక్‌గా యూత్‌కు న‌చ్చేలా ఉంది. ఎవ‌రైతే బైక్స్‌ను బాగా ఇష్ట‌ప‌డ‌తారో వారంద‌రికీ ఈ సాంగ్ న‌చ్చుతుంది. ఉస్తాద్ అనే త‌న బైక్‌ను ఇష్ట‌ప‌డే హీరో గురించి ఈ పాట‌లో చూపించారు. అత‌ను బైక్ రైడ్ ఎలా నేర్చుకున్నాడు? అత‌ని జీవితంలో ఉస్తాద్ అనే బైక్ ఎలాంటి పాత్ర‌ను పోషించింద‌నే విష‌యాల‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. ల‌క్ష్మీ ప్రియాంక రాసిన ఈ పాట‌ను కాల భైర‌వ‌, ఆదిత్య శ్రీరామ్ పాడారు. వీరిద్ద‌రి ఎన‌ర్జిటిక్ వాయిస్‌కు అకీవా.బి అందించిన మ్యూజిక్ నెక్ట్స్ రేంజ్‌లో క‌నెక్ట్ అవుతుంది. 
 
 శ్రీసింహ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కనిపించ‌బోతున్నారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. డిఫ‌రెంట్ మూవీస్‌, ప‌రిమిత బ‌డ్జెట్‌ల‌తో రూపొందుతోన్న సినిమాల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో ఉస్తాద్ నిర్మాత‌లు అదే న‌మ్మ‌కంతో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, రవీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ‌, ర‌వి శివ తేజ‌, సాయికిర‌ణ్ ఏడిద కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments