ఉస్తాద్ రామ్, పూరీ జగన్నాధ్ కామ్ బినేషన్లో డబుల్ ఇస్మార్ట్ లాంఛనంగా ఇటీవలే ప్రారంభమయింది. కాగా జులై 12 రేపటినుంచి డబుల్ ఇస్మార్ట్ షూట్ ప్రారంభం అవుతుంది. ఈలోగ రామ్ తన క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యారు. తన ట్రాన్స్ ఫర్మేషన్ తో అందరినీ డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ లోకి వెళ్లనున్నారు రామ్. దేనికోసం ఇటీవలే గద్దెమ్ పెంచాడు. దాని కోసం ముంబై వెళ్లి అక్కడ స్టైల్ ను మార్చుకున్నాడని తెలిసింది.
కథ, క్యారెక్టర్ డిజైన్, మేకింగ్, స్కేల్, స్పాన్, బడ్జెట్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతిదీ ఇస్మార్ట్ శంకర్‌లో చూసిన దానికి రెట్టింపు ఉంటుంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.
ఈ పాత్ర కోసం చిన్న, స్పైక్డ్ హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రీక్వెల్ అతని మెదడులో చొప్పించిన చిప్‌ను చూపించింది. తల వెనుక భాగంలో ఉన్న కట్ సూచించినట్లుగా డబుల్ ఇస్మార్ట్ డబుల్ రేంజ్‌లో వుంటుందని అర్ధమౌతుంది. ఇది క్యూరియాసిటీని డబుల్ చేస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.