Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రణీత్ కథ చెప్పినప్పుడు భయం వేసింది, ఆనందం కలిగింది : భాగే సాలే నిర్మాత అర్జున్ దాస్యన్

Producer Arjun Dasyan,
, మంగళవారం, 4 జులై 2023 (16:18 IST)
Producer Arjun Dasyan,
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
 
భాగ్‌ సాలే చిత్రాన్ని సురేష్ డిస్టిబ్యూషన్ వాళ్లు విడుదల చేస్తున్నారు. మంచి క్రైమ్ కామెడీ స్టోరీని తీశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నా. క్రైమ్ కామెడీ చాలా తక్కువగా టచ్ చేసినట్లు అనిపించింది. ఈ జోనర్‌లో తక్కువ సినిమాలు వచ్చినా.. ఎక్కువ హిట్స్ వచ్చాయి. అలాంటి మూవీ ఎందుకు తీయకూడదనిపించి భాగ్‌ సాలే చిత్రాన్ని తీశాం.
 
ప్రణీత్ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ భయం కూడా వేసింది. ఆయన చెప్పింది తీయగలుగుతాడా లేదా అని భయమేసింది. మొదటి కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా తీశాడు. హీరో శ్రీసింహాకు ఈ జోనర్‌ బాగా సెట్ అవుతుంది. అతని మొదటి సినిమా మత్తువదలరా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని భావిస్తున్నాం. డైరెక్టర్ కథ అనుకున్నప్పుడే హీరోగా శ్రీసింహాను అనుకున్నారు. సంగీత దర్శకుడిగా కాల భైరవ ఉండాలని ముందే అనుకున్నాం.
 
సినిమాలో హీరో పేరు అర్జున్. సులభంగా ఎదగాలనే అనుకునే కుర్రాడు. ఈ క్రమంలో మోసాలు చేయడం.. ఎదురయ్యే సమస్యలపై హీరో పాత్ర ఉంటుంది. ఓ రింగ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇటీవల ది వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఒక యానిమేషన్ వీడియో విడుదల చేశాం. దీనికి సిద్దూ జొన్నలగడ్డ వాయిస్ అందించారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ కథలా చెప్పాం. మొత్తం సినిమా ఈ రింగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కల్పితమే. అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీతులు చెప్పి స్టేజ్‌పై జీవితాలతో ఆడుకునేవారు గురువు కాదు : పూనమ్ కౌర్