Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌషల్‌తో సినిమా తీయడం అంత సులభం కాదు సుమా

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:05 IST)
కౌషల్ ఆర్మీ అతనిపై తిరుగుబాటు చేసి మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటోంది. అతను డబ్బు మనిషి అని, డబ్బున్న ఫ్యాన్స్‌ను మాత్రమే దగ్గరకు రానిస్తాడని, డబ్బు లేకపోతే ఏ మాత్రం కేర్ చేయడని ఆరోపించారు కొంత మంది అభిమానులు. ఇక తాము కూడా అబ్యూసింగ్‌కు గురయ్యామని మహిళా అభిమానులు కూడా ముందుకొచ్చి చెప్తున్నారు. ఆయనను ఎవరూ ఏదీ ప్రశ్నించకూడదని, అలా ఎవరైనా ప్రశ్నిస్తే వారికి వేధింపులకు గురి చేస్తారని ఆరోపించారు.
 
రాయలసీమ ప్రాంతంలో కౌషల్ ఆర్మీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన హరి కుమార్ మాట్లాడుతూ..కౌషల్‌పై ఇష్టంతో ఎన్నోసార్లు డబ్బు పంపానని వాపోయారు. అంతేకాకుండా అతనితో సినిమా చేద్దామని నిర్ణయించుకుని, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. పూజను వాళ్ల ఆఫీసులో జరిపించాం. నెక్స్ట్ డే కాల్ చేసి రెంట్ కింద 25 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. 
 
అలా రెంట్ పే చేయాల్సి వస్తే నేను అక్కడే మరో ఆఫీస్ తీసుకుంటానని చెప్పాను, ఇక ఆయన భార్యకు కూడా విధులు అప్పగించి రూ.50 వేలు సాలరీ ఇవ్వాలని, ఆఫీస్ బాయ్‌కు రోజూ రూ.2 వేలు ఇవ్వాలని చెప్పారు. దీనితో విసిగిపోయిన నేను ఈ సినిమా తీయలేనని చెప్పేసాను. ఇక అప్పటి నుండి నాకు వేధింపులు మొదలయ్యాయని వాపోయారు సదరు అభిమాని. ఈ గొంతెమ్మ కోరికలు ఏమిటో మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments