Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టుకి వెళ్లయినా దండుపాళ్యం విడుదల చేస్తాం - నిర్మాత వెంకట్‌

Advertiesment
Dandupalyam 4
, ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (13:40 IST)
బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన దండుపాళ్యం 4 చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉంది ఈ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. 
 
ఈ దండుపాళ్యం-4లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ దండుపాళ్యం 4 రూపొందింది. ఇందులో  ఏడుగురు గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు.
 
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఇటీవల సెన్సార్‌ అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమా చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్‌ చేస్తానని చెప్పారు. 
 
సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్‌ చేస్తాననడం  మొదటిసారి చూశా. ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్‌ చెయ్యను. రివైజ్‌ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్‌ కమిటీనే కాదు..  ట్రిబ్యునల్ అదీ కాకపోతే.. కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం అని తెలిపారు.
 
ఇంతకన్నా క్రైమ్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్‌ నుంచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్‌ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడుదల చేస్తాం అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవ‌కాశం వచ్చిందని డి.ఎస్‌.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రమాప్రభతో జరిగింది వివాహం కాదు.. ఒక కలయిక మాత్రమే : శరత్‌బాబు