రమాప్రభతో జరిగింది వివాహం కాదు.. ఒక కలయిక మాత్రమే : శరత్‌బాబు

ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (12:18 IST)
సినీనటి రమాప్రభతో జరిగిన వివాహంపై సినీ నటుడు శరత్‌బాబు స్పందించారు. రమాప్రభను తాను మోసం చేసినట్టు వచ్చిన వార్తలపై ఆయన క్లారిఫై ఇచ్చారు. ఏమీ తెలియని వయసులో కాలేజీ నుంచి ఫ్రెష్‌గా తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు.
 
ముఖ్యంగా, తనకు 22 యేళ్ళ వయసులో ప్రపంచంతో పాటు సమాజంపై ఎలాంటి అవగాహన లేని వయసులో తాను తీసుకున్న నిర్ణయం తన జీవితంపై అమితమైన ప్రభావం చూపిందన్నారు. 
 
ప్రధానంగా తన కంటే ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తమ మధ్య జరిగింది వివాహం కాదని... ఒక కలయిక మాత్రమేనని అన్నారు. రమాప్రభను తాను మోసం చేశానని, ఆమె ఆస్తులను కాజేశానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శరత్‌బాబు వివరణ ఇచ్చారు.
 
ఈ ఆరోపణలు రావడంతో తన పేరుపై ఉన్న ఒక ఆస్తిని విక్రయించి రమాప్రభ, ఆమె సోదరుడు పేర్లపై ఆస్తులు కొని ఇచ్చానని, వాటి విలువ ఇపుడు రూ.50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. అలాగే, టీ నగర్‌లో మరో ఆస్తి విలువ వంద కోట్లకు పైగా ఉంటుందని శరత్ బాబు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బ్రెజిల్ మోడల్‌పై మనసు పడిన విజయ్... నలుగురు భామలతో రొమాన్స్