అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు ఆయన భార్య మెకంజీ బెజోస్ విడాకులు ఇవ్వనుంది. జెఫ్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మనోవర్తి కింద ఆమె భారీ మొత్తాన్నే డిమాండ్ చేస్తోంది. ఆమె డిమాండ్ చేసే మొత్తాన్ని జెఫ్ చెల్లించినపక్షంలో మనోవర్తి భరణం ద్వారా అత్యంత ధనవంతురాలైన మహిళగా మెకంజీ అవతరించనుంది.
కాగా, తమ విడాకుల విషయంపై జెఫ్ దంపతులు కలిసి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 'కొన్ని నెలలుగా విడిగా ఎలా ఉండగలమనేది ప్రయోగాత్మకంగా చూశాం. విడిపోయి స్నేహితులుగా ఉండగలమనే నమ్మకం కుదిరాక చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని నిశ్చయించాం' అని అందులో పేర్కొన్నారు.
ఈ విడాకుల ద్వారా జెఫ్ బెజోస్ తన ఆస్తిలో దాదాపు సగం భాగం మెకంజీకి భరణంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని విలువ దాదాపు 4.2 లక్షల కోట్లు మనోవర్తి ఇవ్వాలి. ప్రపంచ చరిత్రలో ఇంత భారీగా మనోవర్తి తీసుకోనున్న మహిళ మెకంజీయే కానుండడం విశేషం. అంతేకాదు, ఈ భరణం ద్వారా ఆమె ప్రపంచంలోనే అత్యధిక సంపన్నురాలైన మహిళ కానున్నారు.
కాగా, అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన జెఫ్ బెజోస్‌కు పరాయి మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వాలని బెజోస్ భార్య మెకంజీ బెజోస్ నిర్ణయించుకుంది. ఫలితంగా బెజోస్ దంపతలు 25 యేళ్ళ వైవాహిక బంధం తెగిపోనుంది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌కు హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్‌సెల్ భార్య లారెన్ సాంచెజ్‌తో అక్రమ సంబంధం ఉన్నట్టు మెకాంజీ బెజోస్ బలంగా నమ్మింది. దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వనుంది.
ఎక్వైరర్ అనే సీక్రెట్ ఏజెన్సీ బెజోస్, సాంచెజ్‌లపై గత 8 నెలలుగా నిఘా పెట్టింది. వారిద్దరిని వెంటాడుతూ 5 రాష్ట్రాల్లో 40 వేల మైళ్ళు ప్రయాణం చేసింది. వాళ్లు ప్రైవేట్ జెట్స్‌లో తిరగడం, ఫైవ్‌స్టార్ హోటళ్లలో రహస్యంగా గడపడం, డిన్నర్ డేట్స్‌కు వెళ్లడంలాంటి విషయాలను బయటపెట్టింది. కాగా, జెఫ్ బెజోస్, మెకంజీలకు నలుగురు పిల్లలు ఉన్నారు. తన సక్సెస్‌కు తన భార్యే కారణమని బెజోస్ పదే పదే చెబుతుంటారు. అలాంటిది ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు.